SRINIDHI SHETTY: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..

Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..  

KGF ఫ్రాంచైజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కర్ణాటకలోని (తాళిపాడి) తుళు మాట్లాడే ప్రాంతాలకు చెందిన దైవ కోలా(Daiva Kola) ప్రదర్శనకు హాజరయ్యారు. శ్రీనిధి పూర్వీకుల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయ ప్రదర్శనకు హాజరయ్యి దేవతల ఆశీర్వాదం తీసుకుంది. 

భూతకోల, దక్షిణ కన్నడ తీర ప్రాంతంలో తుళునాడుగా ప్రసిద్ధి చెందిన ఒక ఆచారం. భూత కోలా అనేది స్థానిక ఆత్మలకు నివాళులు అర్పించే పురాతన ఆచారం. అంతేకాకుండా వారు స్థానికులను రక్షించడానికి మరియు ప్రకృతికి మనిషి మధ్య ఉన్న సున్నితమైన విశ్వ సమతుల్యతను కొనసాగించాలని భావిస్తూ జరుపుతున్న పండుగ ఇది. 

ఈ వేడుకలో శ్రీనిధి కుటంబం అంతా కలిసి తమ ఆచారాలతో, సంప్రాదాయాలతో పూజించే దేవతను..అంటే- జారందయ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేమోత్సవ లేదా భూతకోల ఆచారంలో పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

ఈ విశిష్ట పండుగ రోజున మెరిసే నారింజ రంగు చీరలో..సొగసైన అందాలను వెదజల్లింది.అలాగే ఆమె జుట్టును బన్‌లో కట్టుకుని చక్కని సాంప్రదాయ పద్దతిలో కనిపించి ఆకట్టుకుంది. ఈ ఆనందోత్సవంలో శ్రీనిధి తన కుటుంబ సభ్యులు, బంధువులతో గడిపి దైవిక సందేశాలను పొందింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి 

ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఆమెతో పాటు రాశి కన్నా కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ కోన వెంకట్ సిస్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వం వహిస్తుంది. అలాగే కన్నడలో కిచ్చా సుదీప్ తో మరో సినిమాలో నటిస్తుంది. మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ భామ.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T10:37:42Z dg43tfdfdgfd