SUKANYA SAMRIDDHI YOJANA: కేంద్ర ప్రభుత్వం నుంచి 5 గొప్ప స్కీమ్స్.. ఏటా రూ. 1.50 లక్షల వరకు బెనిఫిట్..

Post Office Time Deposit: ఈ రోజుల్లో చాలా మంది తమ సంపాదనలో కనీసం కొంత మొత్తమైనా ఆదా చేసుకుంటున్నారు. దీనిని పెట్టుబడుల రూపంలోకి మళ్లించే వారు కూడా చాలా మందే ఉంటున్నారు. వీటిల్లో దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ అందించే వాటివైపు మొగ్గుచూపడం ఉత్తమం. ఇలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఎన్నో బెస్ట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది. వీటిల్లో పెట్టుబడులతో లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వడ్డీ ఆదాయం వస్తుంది. ఇతర బ్యాంక్ డిపాజిట్లు, ఇతర స్కీమ్స్‌తో పోలిస్తే వీటిల్లోనే డబ్బులు సురక్షితం అని చెప్పొచ్చు. కేంద్రం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి రిస్క్ ఉండదు.

ఇంకా ఇతర వాటితో పోలిస్తే వీటిల్లో ప్రధానంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటిల్లో సుకన్య సమృద్ధి పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్ ఇలా చాలానే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.

>> పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అత్యంత ఆదరణ పొందిన స్కీమ్ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది కేంద్రం. ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. తర్వాత ఐదేళ్ల చొప్పున పెంచుకుంటూ పోవొచ్చు. కొన్ని అవసరాలకు ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ ఉండదు.

>> సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన ఇన్వెస్టర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. గరిష్టంగా దీంట్లో రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ. 1000 సరిపోతుంది. సెక్షన్ 80c కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల టాక్స్ తగ్గించుకోవచ్చు. దీంట్లో వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది.

>> నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో కనీసం రూ. 1000 తో పెట్టుబడి ప్రారంభించొచ్చు. దీంట్లో వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అకౌంట్ ముందుగానే క్లోజ్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ కూడా లాకిన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంది.

>> పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు కూడా మంచి ఆప్షన్. దీంట్లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో ఉంటాయి. సెక్షన్ 80c కింద ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌లో మాత్రమే టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. దీంట్లో ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ రేటు ఉంది. కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాలి.

>> ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకొచ్చిన బెస్ట్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. దీంట్లో కూడా 8.20 శాతం వడ్డీ రేటు ఉండగా.. వరుసగా 15 ఏళ్లు డబ్బులు కట్టాలి. కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. పదేళ్ల లోపు పాప పేరిట అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దీంట్లో కూడా టాక్స్ బెనిఫిట్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T14:06:41Z dg43tfdfdgfd