INTER SUMMER HOLIDAYS: ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి భారీగానే..

Summer Holidays for Telangana Inter colleges : తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు (Summer Holidays) ఇంటర్‌ బోర్డు (TSBIE) సెలవులు ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం.. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. అలాగే ఇంటర్ బోర్డు ప్రకటన తర్వాత కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని కూడా ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులకు దాదాపు రెండు నెలల పాటు వేసవి సెలవులు వచ్చినట్లయ్యింది.

ఏపీలో ఏప్రిల్‌ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌స్తుతం ఒంటిపూట బడులు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్‌ 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూళ్లకు వేస‌వి సెల‌వులు (Summer Holidays 2024) ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఉండే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే.. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు స్కూళ్లకు సంబంధించిన వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T14:19:31Z dg43tfdfdgfd