TDP CANDIDATES LIST: టీడీపీ ఫైనల్‌ లిస్ట్‌ విడుదల.. వారికి భారీ షాకిచ్చిన చంద్రబాబు

TDP List: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న స్థానాలకు అభ్యర్థులను పూర్తి చేసింది. మొత్తం 175 స్థానాల్లో పొత్తులో భాగంగా టీడీపీ 144, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుండగా అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. మొత్తం ఐదు జాబితాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఆఖరి జాబితాలో 9 అసెంబ్లీ, నాలుగు పార్లెమంట్‌ స్థానాలకు అభ్యర్థును ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని ప్రచారంలోకి దూకనుంది.

Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్‌ ధ్వజం

తీవ్ర సందిగ్ధంలో ఉన్న స్థానాలకు ఐదో జాబితాలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. చీపురుపల్లి, భీమిలి వంటి కీలక స్థానాలకు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస రావును అభ్యర్థులుగా ప్రకటించారు. భీమిలి కాకుండా చీపురుపల్లి సీటు ఆశించిన గంటాకు తిరిగి సిట్టింగ్‌ స్థానం భీమిలినే కేటాయించడం గమనార్హం. కదిరి స్థానంపై పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలోనే కందికుంట యశోద పేరును ప్రకటించగా తాజాగా అభ్యర్థిని మార్చేశారు. ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు కదిరి టికెట్‌ ఇస్తూ పార్టీ నిర్ణయించింది. 

Also Read: BJP List: బీజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. సీనియర్లకు షాక్‌.. ఫిరాయింపుదారులకు ఛాన్స్

ఎమ్మెల్యే అభ్యర్థులు..

1. చీపురుపల్లి - కళా వెంకట్రావు

2. భీమిలి - గంటా శ్రీనివాసరావు

3. పాడేరు - వెంకటరమేశ్‌ నాయుడు

4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి

5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం

6. ఆలూరు - వీరభద్ర గౌడ్‌

7. గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్‌

8. అనంతపురం అర్బన్‌ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌

లోక్‌​సభ అభ్యర్థులు

1. విజయనగరం - అప్పలనాయుడు

2. ఒంగోలు - మాగుంట శ్రీనివాసులరెడ్డి

3. అనంతపురం - అంబికా లక్ష్మినారాయణ

4. కడప - చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డి

కూటమి సీట్లు ఇలా..

తెలుగుదేశం పార్టీ: 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ

జనసేన పార్టీ: 21 ఎమ్మెల్యే, 2 లోక్‌సభ

బీజేపీ: 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్

పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇంకా 3 అసెంబ్లీ స్థానాలు పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-29T11:48:28Z dg43tfdfdgfd