TS MODEL SCHOOL RESULTS : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

Telangana Model School Entrance Exam 2024: తెలంగాణలో మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష(Telangana Model School Exam 2024)ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీన ఈ ఎగ్జామ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విద్యార్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంక్ ను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ఈ ప్రవేశ పరీక్ష(Telangana Model School Admissions) ద్వారా…  6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీ చేస్తారు.ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు(Telangana Model Schools) ఉన్నాయి. 6వ తరగతిలో మొత్తం  19,400 సీట్లను భర్తీ చేస్తారు. ఇక 7-10 తరగతుల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి.  సీట్లు సాధించిన విద్యార్థుల జాబితాను మే 25న ప్రకటిస్తారు. 

TSMS Results 2024 : ఫలితాలను ఇలా చెసుకోవచ్చు 

  • పరీక్ష రాసిన విద్యార్థులు https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ఆరో తరగతితో పాటు 7 -10 తరగతి ప్రవేశాల నోటిఫికేషన్లు కనిపిస్తాయి.
  • ఆయా ఆప్షన్ల పక్కనే Know Your Merit అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి.
  • ఓపెన్ అయిన విండోలో మీ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీతో పాటు Verification కోడ్ ను ఎంట్రీ చేాయాలి.
  • Get Results పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కూడా డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • ప్రవేశాల సమయంలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

2024-05-02T12:39:26Z dg43tfdfdgfd