TSPSC: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల, జనరల్‌ ర్యాంకు జాబితాలు వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్

TSPSC AE General Ranking List: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను TSPSC విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాతపరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితా(GRL)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. తిరస్కరణకు గురైన లేదా అనర్హులైన అభ్యర్థుల వివరాలను జనరల్ ర్యాంకింగ్ జాబితాలో పొందుపరచలేదని ఆయన వెల్లడించారు.

సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు..

తెలంగాణలో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి 2022, సెప్టెంబరు 12న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఉద్యోగాల భర్తీకి 2023 అక్టోబరు 18, 19, 20 తేదీల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), టెక్నికల్‌ ఆఫీసర్‌ (టీవో), జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (జేటీవో) ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరిగాయి. ఇక మెకానికల్ విభాగానికి అక్టోబరు 26న పరీక్ష నిర్వహించారు.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 833

* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 

విభాగాలవారీగా పోస్టుల వివరాలు..

1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్)

2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్.

3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు

విభాగం:  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.

7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు

విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.

9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్

10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు

విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

జీతభత్యాలు: నెలకు రూ.45960-రూ.124150 చెల్లిస్తారు.

* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు

1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ.

2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్

3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు

విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు

విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

జీతభత్యాలు: నెలకు రూ.32810-రూ.96890 చెల్లిస్తారు.

ALSO READ:

TSPSC: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ వాయిదాకు 'నో' ఛాన్స్‌, పరీక్ష నిర్వహణకు సిద్ధమే అంటున్న అధికారులు

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కూడా వచ్చే నెలాఖరులోగా విడుదల చేయాలని కమిషన్‌ అధికారులు భావిస్తున్నారు. 

పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

2024-04-26T06:43:11Z dg43tfdfdgfd