TSPSC : తెలంగాణ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. జనరల్‌ ర్యాంక్‌ల జాబితా విడుదల

TSPSC TS polytechnic lecturer GRL list : తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ర్యాంకుల జాబితాలో కోసం.. https://www.tspsc.gov.in/GRLPL13570AS లింక్‌పై క్లిక్ చేయండి. మొత్తం 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు సబ్జెక్టుల వారిగా నిర్వహించిన పాలిటెక్నికల్ లెక్చరర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ త్వరలో వెల్లడించనుంది.

TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2లో రివైజ్డ్‌ ఖాళీల వివరాల ప్రకటన

తెలంగాణ గ్రూప్‌-2 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి రివైజ్ట్‌ ఖాళీల వివరాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటిచింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నందున గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల రివైజ్డ్‌ బ్రేకప్‌ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలగించి.. అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్‌ వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

TS TET 2024 : తెలంగాణ టెట్‌ దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ

Telangana TET 2024 : తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషషన్‌ ప్రాసెస్‌ ఈరోజు (ఏప్రిల్ 20)తో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 10వ తేదీతో టీఎస్‌ టెట్‌ 2024 దరఖాస్తు గడువు ముగియగా.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 20 వరకు TS TET 2024 దరఖాస్తు గడువు పొడిగించారు. దీని ప్రకారం ఏప్రిల్‌ 20వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. నిర్ణయించిన ఫీజును ముందుగానే చెల్లించాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T08:10:53Z dg43tfdfdgfd