VIJAYAWADA CENTRAL: విజయవాడ సెంట్రల్ టికెట్‌లో మార్పు, వంగవీటి రాధాకు అవకాశమా

Vijayawada Central: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే అందరి దృష్టీ నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలకమైన విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీకు ఇబ్బందికర పరిస్థితి ఎదురౌతోంది. 

ఇటీవల విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల్ని ఇప్పటికే సిట్ అరెస్టు చేయగా దాడి వెనుక విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం అభ్యర్ధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉందని నిర్ధారించింది. దాంతో బొండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ ఘటనను ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో బొండా ఉమ ప్రమేయం ఉన్నట్టు తేలితే ఈసీ తగిన చర్చలు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ కేసులో బొండా ఉమా అరెస్ట్ జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని మార్చే అవకాశాల గురించి పరిశీలిస్తోంది. 

బొండా ఉమా విజయవాడ సెంట్రల్ అభ్యర్ధిగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు ఇంకా ఐదు రోజుల సమయముంది. ఒకవేళ బొండా ఉమా అరెస్ట్ అయితే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని వంగవీటి రాధాకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. బొండాతో నామినేషన్ పత్రాల్ని ఉపసంహరింపజేసి వంగవీటి రాధాతో నామినేషన్ దాఖలు చేయించవచ్చు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విజయవాడ సెంటర్ల నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి అవకాశం వస్తుందో లేదో చూడాలి. 

వంగవీటి రాధాకు అవకాశం దక్కడం అనేది ముఖ్యమంత్రి జగన్‌పై దాడి కేసులో పురోగతి, బొండా ఉమా అరెస్టు, ఈసీ చర్చలపై ఆధారపడి ఉంటుంది. 

Also read: TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-20T07:13:40Z dg43tfdfdgfd