VOTER SLIP ONLINE: మీకు ఓటర్‌ స్లిప్ వచ్చిందా.. ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!

Voter Slip: ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 3 దశల పోలింగ్ పూర్తయింది. మే 13 వ తేదీన 4 వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలోనే తెలంగాణలో 17 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అధికారుల విధులు, ఈవీఎంల తరలింపు, పోలింగ్ స్టేషన్ల వద్ద సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇక బీఎల్ఓ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఓటర్ స్లిప్‌లు అందిస్తున్నారు. కానీ కొందరికి ఓటర్ స్లిప్‌లు అందడం లేదు.

ప్రతీ ఓటరుకు కూడా ఓటర్ స్లిప్ అందించేందుకు క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే చివరి నిమిషం వరకు కూడా అందరికీ అందించే పరిస్థితి ఉండదు. దీంతో ఓటరు స్లిప్ అందని వారు కొందరు ఓటు వేయకుండా ఇంట్లోనే ఉంటారు. అలాంటి వారికి ఓటర్ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ ఓటర్ స్లిప్‌పై ఓటరు వివరాలు ఉంటాయి. ఓటరు పేరు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ఈసీఐ యాప్, వెబ్‌సైట్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నుంచి ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఈ ఓటర్ స్లిప్‌పై ఓటరు పేరు, వయసు, లింగం, అసెంబ్లీ నియోజవకవర్గం, పోలింగ్ స్టేషన్ లొకేషన్, పోలింగ్ రూం నంబర్, పోలింగ్ తేదీ సమయం ఉంటాయి. వీటితోపాటు ఆ ఓటర్ స్లిప్‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఓటరు వివరాలని తక్షణమే తెలుసుకునే వీలు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  • ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను మొబైల్ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • డౌన్‌లోడ్ E-EPIC అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి.
  • మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత ఓటర్ ఐడీ కార్డు మీద ఉన్న EPIC నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • ఒకవేళ EPIC నంబర్ లేకపోతే అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ ద్వారా కూడా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కనిపిస్తుంది.
  • అక్కడే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ నుంచి ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  • గూగుల్‌లో https://voters.eci.gov.in ఓపెన్ చేయాలి.
  • మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతుంది.
  • అందులో Download E-EPIC అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఓటర్ ఐడీ కార్డుపై ఉన్న EPIC నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • అక్కడి నుంచి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T16:14:08Z dg43tfdfdgfd