WEATHER TODAY: ఆరెంజ్ జోన్‌లో ఆ జిల్లా.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ డిగ్రీలుగా నమోదవుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జిల్లా ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఎండవేడిమి తోడు వడగాలులు తోడవుతున్నాయి. దీంతో జిల్లా వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగ్ ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదింది. పెరుగుతున్న ఉష్ణోగ్రత, వడగాలుల కారణంగా జిల్లాలో పలువురు వడదెబ్బ తగిలి మృతి చెందారు. కాగా మరికొన్ని రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసవి కాలంలో ప్రారంభంలో కొంత మబ్బులతో కమ్ముకోవడం, అడపాదడపా వర్షాలు కూడా కురియడంతో వేసవి ఎండల ప్రభావం అంతగా కనిపించలేదు. కాని గత రెండు మూడు రోజుల నుండి పెరిగిన ఎండ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేల, మంచిర్యాల జిల్లా నస్పూర్ లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

భారీ గుడ్ న్యూస్.. రూ.3,300 పతనమైన బంగారం ధర.. కొనాలా? వద్దా? ఇంకా పడిపోతుందా..

ఎండ వేడిమి, వడగాల్పుల కారణంగా ప్రజలు బయట కాలుపెట్టేందుకు జంకుతున్నారు. పగటిపూట రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అవసరమైతే తలకు రుమాలు చుట్టుకొని బయటకు వస్తున్నారు. మరోవైపు వీధి వ్యాపారులు గొడుగులు పెట్టుకొని వాటి కింద కూర్చొని పండ్లు, కూరగాయలను విక్రయిస్తున్నారు. తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహించేవారు నీడ కోసం తడకలను ఏర్పాటు చేసుకొని ఒకేచోట విక్రయాలు జరుపుతున్నారు. ఒక్కసారిగా పెరిగిపోయిన ఉష్ణతాపంతో పిల్లలు, వృద్దులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలు సూచిస్తున్నారు. ఇక నిత్యావసరాలు, ఇతర రోజువారి పనుల కోసమైతే బయటకు రాక తప్పదని ప్రజలు వాపోతున్నారు. ఏదిఏమైనప్పటికి గతంతో పోల్చితే ఈసారి ఎండల తీవ్రత అధికంగానే ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

2024-05-04T06:07:14Z dg43tfdfdgfd