WHITE HOUSE: అమెరికా అధ్యక్ష నివాసం వద్ద కలకలం.. గేటును ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి

White House: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వద్ద కలకలం ఏర్పడింది. శ్వేత సౌధం భవనం గేటును ఓ కారు ఢీకొట్టింది. దీంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడింది. అయితే ఆ ఘటనలో కారు డ్రైవర్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఏడాదిలో ఈ సంఘటన రెండోది కావడం గమనార్హం.

Aslo Read: Nikhil Chaudhary: వివాదంలో చిక్కుకున్న క్రికెటర్‌... కారులోనే అత్యాచారం చేశాడని మహిళ ఆరోపణలు

'రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. వైట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌ బయట గేటును బలంగా ఢీకొట్టింది' అని వైట్‌ హౌస్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టింది. కానీ ప్రమాదం తీవ్రత అధికంగా ఉండడంతో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఉగ్ర కోణం ఏమైనా ఉందా అని పోలీస్‌ విభాగాలు విచారణ చేపట్టాయి. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని.. కుట్రకోణాలు ఏమీ లేవని భద్రతా దళాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

Also Read: GPS Jamming: స్తంభించిన జీపీఎస్‌.. విమానాలకు అంతరాయంతో ప్రపంచ దేశాల్లో కలకలం

ఈ ఘటనపై భద్రతా దళాలు విచారణ చేపట్టాయి. స్థానిక పోలీసులతో పాటు దర్యాప్తు చేపట్టిన సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం 'భద్రతపరంగా ఎలాంటి ముప్పు లేదు' అని ప్రకటించింది. అయితే అధ్యక్ష భవనం సమీపంలో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదాలపై అక్కడి భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శ్వేత సౌధం వద్ద భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రమాదం రూపేణ అసాంఘిక శక్తులు కూడా దాడి చేసే అవకాశం ఉండడంతో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. కాగా ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌, మాజీ అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఫలితాల పరంగా చూస్తే ట్రంప్‌ ముందంజలో ఉన్నట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-05T17:25:56Z dg43tfdfdgfd