అంతన్నారు.. ఇంతన్నారు.. మరి ఇప్పుడు మాట మారుస్తారా- వైసీపీ సూటి ప్రశ్న

టీడీపీ నేతలు వేలెత్తి చూపితే భూతం... భూతమే కానీ మనిషి కాదుగా.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల టిడిపి నేతలు వ్యవహరించేది ఇలాగేనా అంటూ వైసీపీ నేతలు తమ విమర్శలకు పదును పెట్టారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ విమర్శలు దుమారం రేగుతున్నాయి. ఈ విమర్శలు ప్రధానంగా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పైనే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే రైతన్నలకు, భూయాజమానులకు వరమని చెప్పిన టీడీపీ, ఒక్కసారిగా మాట మార్చి ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తుందని ఇటీవల పలువురు వైసీపీ నేతలు వక్కాణించి పలుకుతున్నారు. అయితే ల్యాండ్ టైటలింగ్ చట్టం ఉంటే చాలు ఇక ఎక్కడా భూసమస్యలు ఉండవు అన్న మాటలు మొన్నటి వరకు పచ్చ మీడియా కోడై కూసి, ఇప్పుడు ఒక్కసారిగా ఈ చట్టం తో ఇక భూయాజమానులకు ఇక హక్కులే ఉండవన్న రీతిలో హోరెత్తిస్తుందని వైసీపీ తన సోషల్ మీడియా వేదికగా తన బాణీ వినిపిస్తోంది. అంతేకాదు టిడిపి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా టిడిపి సభ్యులు ఈ చట్టం పై మద్దతుగా బల్లాలు చరిచిన విషయం మరిచి పోయారా.. కేవలం భూ సమస్యలకు చెక్ పెట్టే ఈ చట్టం పై అబద్దాలు చెబుతూ.. ప్రజలను ఏమార్చడం తగదని వైసీపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు.

Tirumala Annadanam: తిరుమలలో ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఇక ,

మొన్నటి వరకు ల్యాండ్ టైటలింగ్ చట్టం గురించి ఈ చట్టం అమలైతే చాలు .. ఇక రాష్ట్రంలో ఎటువంటి భూ ఆక్రమణలు ఉండవని, రాష్ట్ర బిజెపి నాయకత్వం సైతం మొన్నటి వరకు ప్రకటనలు విడుదల చేసింది. అయితే ఒక్కసారిగా కూటమి ఎఫెక్ట్ కనపడిందో ఏమో కానీ, ఇప్పుడు చట్టంపై నోరు మెదపని పరిస్థితి సమంజసం కాదని వైసీపీ తెలుపుతోంది. గతంలో అదే నోటితో ఈ చట్టం రావాలి.. కావాలి అన్న నేతలు ఒక్కసారిగా న్యూ టర్న్ తీసుకోవడం వారికి ఉన్న చిత్తశుద్దికి ఇదొక ఉదాహరణ అంటూ.. వైసీపీ నేతలు మీడియా సమావేశాల ద్వారా తెలుపుతోంది. మరి ఇంతకు నాడు తీపి గా ఉన్న ఈ చట్టం నేడు టిడిపి కూటమికి చేదుగా మారిందా అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. మరి దీనికి కూటమి సమాధానం ఎలా ఉంటుందో కానీ ఏపీ పొలిటికల్ రింగ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పావుగా మారిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

2024-05-06T08:30:09Z dg43tfdfdgfd