అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్

అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్

కరీంనగర్, వెలుగు: ప్రధాని మోదీ గత పదేళ్లలో మన జేబులు కత్తిరిస్తూ తన మిత్రులైన అంబానీ, అదానీ జేబులు నింపారని హైకోర్టు రిటైర్డ్‌‌‌‌ జడ్జి చంద్రకుమార్‌‌‌‌ ఆరోపించారు. దేశంలోని 2 శాతం వ్యాపారులకు లాభం చేకూరుస్తూ, హిందువులను ఉద్ధరిస్తున్నానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌‌‌‌లోని రెవెన్యూ గార్డెన్స్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నదవి ఎవరో, అంబాని, అదాని జేబులు నింపుతున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌ గతంలో చేసిన అప్పులు తీర్చడం కోసం పెట్రోల్, డీజిల్‌‌‌‌ రేట్లు పెంచామని చెప్పడం సరికాదన్నారు. గతంలో 14 మంది ప్రధానులు రూ. 50 లక్షల కోట్ల అప్పు చేస్తే .. మోదీ పదేళ్లలో   రూ. కోటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. క్రూడాయిల్‌‌‌‌ ధర 162 ఉన్నప్పుడు డీజిల్ ధర రూ.62 ఉంటే, ఇప్పుడు క్రూడాయిల్‌‌‌‌ ధర రూ.62 ఉంటే డీజిల్ ధర రూ. 100 ఎలా అయిందని ప్రశ్నించారు. 

ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌‌‌‌ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పదేళ్లలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాష్ట్రాల హక్కులను హరించేలా అధ్యక్ష తరహా పాలన వచ్చే ప్రమాదముందన్నారు. పదేళ్లలో అమలు చేసిన ఆర్థిక విధానాల వల్ల దేశంలో 162 మంది కుబేరులు అయ్యారని, సంపద మొత్తం వారి చేతుల్లోకి చేరిందన్నారు. సభలో వేణుగోపాల్, విష్ణు, మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:45:04Z dg43tfdfdgfd