అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రాజ్యాంగాన్ని మర్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు.  అందుకే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు చేయలేదని తెలిపారు.  రిజర్వేషన్లు రద్దు చేయాలన్న రహస్య ఒప్పందం నడిచిందని అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు. ఆదిలాబాద్ లో నిర్వహించన జనగార్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. ఓటు వేసి రిజర్వేషన్ ను రద్దు చేయించుకుంటారా అని ప్రజలను అడిగారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు. ఇవి మాట్లాడితే తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుందని రిజర్వేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు. కేసీఆర్ మోదీ తెలంగాణకు ఏం చేయలేదని ఆరోపించారు. సోయం బాపూరావును ఎంపీగా గెలిపిస్తే ఆదిలాబాద్ కు ఏం ఇచ్చారని ప్రశ్నించారు.  ఆదిలాబద్ పార్టమెంట్ సీటును ఏ పార్టీ కూడా ఇంత వరకు  మహిళకు ఇవ్వలేదని ఫస్ట్ టైం సోనియా గాంధీ ఆత్రం సుగుణకు ఇచ్చారని ఆమెను భారీ మెజారిటీతోని గెలిపించాలని  కోరారు.  అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోను ఐదు గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T12:01:02Z dg43tfdfdgfd