అక్షయ తృతీయ ఎంతో శుభప్రదం.. అయినా పెళ్లి ముహూర్తాలు లేవు.. ఎందుకంటే..?

హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో అక్షయ తృతీయ (Akshaya Tritiya) ఒకటి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలలో ఈ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తదియ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10న శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ 2024 పూజ ముహూర్తం ఉదయం 5:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు ఉంటుంది. తృతీయ తిథి మే 10 ఉదయం 4:17 గంటలకు ప్రారంభం అవుతుంది. మే 11 ఉదయం 2:50 గంటలకు ముగుస్తుంది. అయితే ఇంత పవిత్రమైన రోజున పెళ్లిళ్లకు ఎలాంటి శుభ ముహూర్తం ఉండకపోవడం గమనార్హం. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

* వివాహాలకు శుభ ముహూర్తం లేదా?

అక్షయ తృతీయ సాధారణంగా శుభం, సంపదకు ప్రతీకగా పరిగణించే ఒక పవిత్రమైన హిందూ పండుగ. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వివాహాలు జరపడం వంటి శుభ కార్యక్రమాలు తలపెడితే చాలా మంచిదిగా భావిస్తారు. కానీ ఈ ఏడాది, అంటే 2024 అక్షయ తృతీయ నాడు శుభ కార్యాలకు, ముఖ్యంగా పెళ్లిళ్లకు అనువుగా లేదు. గత 23 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా, ఈసారి అక్షయ తృతీయ నాడు వివాహాలకు శుభ ముహూర్తాలు లేవు. దీనికి కారణం శుక్రుడు, గురు గ్రహాల ప్రత్యేక స్థానాలలో ఉండటమే అని చెప్పవచ్చు.

ఈ సంవత్సరం, మే 10న గురు, శుక్ర గ్రహాల స్థానం కారణంగా, ఈ రోజు వివాహాలకు అనుకూలంగా ఉండదు. గురువు గ్రహం సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. శుక్రుడు గ్రహం ప్రేమ, వైవాహిక సంతోషానికి కారణం అవుతాడని నమ్ముతారు. సాధారణంగా, ఈ రెండు గ్రహాలు ఒకేసారి ఉదయించడాన్ని చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు.

ముఖ్యంగా ఈ గ్రహాలు ఒకేసారి ఉదయించిన సమయంలో మ్యారేజ్ చేసుకుంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. కానీ ఈ అక్షయ తృతీయ నాడు, ఈ రెండు గ్రహాలు కూడా అస్తమిస్తాయి, కాబట్టి అవి వివాహ బంధాలకు శుభప్రదమైన ఆశీస్సులను అందించలేవు. అందువల్ల, ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిది.

అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకోవడం మంచిది కాదు కానీ జులై నెలలో వివాహాలకు చాలా శుభ తేదీలు ఉన్నాయి. జులై 9, 11, 12, 13, 14, 15 డేట్స్‌లో పెళ్లిళ్లకు శుభప్రదమైన తేదీలు.

* చాతుర్మాస్యం

2024, జులై 17 నుంచి నవంబర్ 12 వరకు చాతుర్మాస్యం ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించవు. ఈ కాలాన్ని అశుభంగా పరిగణిస్తారు. చాతుర్మాస్యం తర్వాత అంటే నవంబర్ 13 నుంచి మళ్లీ శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారు పంచాంగం ప్రకారం శుభ తేదీలు, ముహూర్తాలను ఎంచుకోవాలి. గ్రహాల స్థానాలు, నక్షత్రాల స్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. జ్యోతిష్య పండితుల సలహాలు తీసుకోవచ్చు.

2024-05-08T06:21:49Z dg43tfdfdgfd