అదిరే జీతం.. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్, అర్హతలు ఇవే!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. డిగ్రీ పట్టా చేతిలో ఉన్నా లాభం లేదని చింతిస్తున్నారా, అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సారి ఉద్యోగం నోటిఫికేషన్ వేతుకుంటూ వచ్చింది. దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం టీచింగ్ చేయాలనే ఆలోచన తో పాటు ఈ కొన్ని డాక్యుమెంట్స్ మీ వద్ద ఉంటే చాలు. నెలకి మంచి వేతనంతో కూడిన ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఉద్యోగం ఏంటి.. ఎక్కడ చేయాలి.. జాబ్ ప్రొఫైల్ ఏంటి.. అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం లింగాపూర్ ఆదర్శ పాఠశాల లో కెమిస్ట్రీ సబ్జెక్టు పీ జీ టీ పోస్ట్ కొరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సర తస్నీమ్ ప్రకటన విడుదల చేశారు. ఆదర్శ పాఠశాలల ఉన్న ఒకే ఒక్క పోస్ట్ కి ఉద్యోగం అవకాశాల కోసం చూసే నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రకటనలో కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మే 16 తేది వరకు అవకాశాన్ని కల్పించారు. ఈ ఉద్యోగం హవర్లి బెస్డ్ ప్రతిపదికన పని చేయుట కొరకు మాత్రమే అని వారు తెలిపారు. నెల వారీ వేతనం 18,200 రూపాయలు ఇస్తారు అని తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద రూ.50 వేలు.. కరువు పనికి వెళ్లే వారికి గుడ్ న్యూస్!

ఉద్యోగానికి కావాల్సినవి ఇవే...

రామగుండం లింగాపురం లో ఉన్న ఆదర్శ పాఠశాలలో హావర్లి బెస్డ్స్ కెమిస్ట్రీ సబ్జెక్టు పీజీటీ పోస్టులో పని చేయాలని ఆసక్తి ఉన్నవారు. Msc,B,Edపూర్తి చేసి ఉండాలి. పూర్తి చేసిన వారు సర్టిఫికెట్లతో బయోడేటా ఫాం తీసుకుని,సంబంధిత విద్య అర్హతల జిరాక్స్ సెట్ లతో పాఠశాలలో సమర్పించాలి. అప్లికేషన్ తీసుకునే సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మాాత్రమే తీసుకుంటారు.ఈ అవకాశం కేవలం ఈ నెల 16 వ తేది వరకు మాత్రమే కల్పించారు. ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుకి సంప్రదించవచ్చు.99513 57679.

2024-05-04T01:21:22Z dg43tfdfdgfd