అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే

Indian Origin Man Shot Dead: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. శాన్ ఆంటోనియో జరిగిందీ ఘటన. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు వెంటాడారు. కానీ ఆ సమయంలో తన వాహనంతో వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సచిన్‌ సాహూని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇలా జరిగిందని వివరించారు. మృతుడి పేరు (Sachin Sahoo) సచిన్ సాహూ. యూపీకి చెందిన సచిన్‌కి ఇటీవలే అమెరికా పౌరసత్వం వచ్చింది.

ప్రాథమిక విచారణ ప్రకారం..ఏప్రిల్ 21న సాయంత్రం శాన్‌ ఆంటోనియోలోని నిందితుడి ఇంటికి వెళ్లారు. ఓ వ్యక్తిపై పదునైన ఆయుధంతో దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో సచిన్ సాహూ తన కార్‌లో వేగంగా దూసుకెళ్తూ అక్కడ ఓ మహిళని ఢీకొట్టాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆ మహిళను హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాసేపటి తరవాత స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. సాహూ మళ్లీ ఇంటికి వచ్చాడని సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సాహూని అరెస్ట్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలోనే కార్‌తో మరోసారి పోలీస్‌లను అడ్డుకునే ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓ పోలీస్‌కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే మరో అధికారి గన్‌తో కాల్చాడు. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని పోలీసులు వివరించారు. 

"సచిన్ సాహూని అరెస్ట్ చేసేందుకు  పోలీసులు వెళ్లారు. వెంటనే ఆ వ్యక్తి కార్‌లోకి దూరి వేగంగా దూసుకొచ్చాడు. పోలీసులు అడ్డుకోబోతుంటే అలాగే ముందుకు పోనిచ్చాడు. వాళ్లని ఢీకొట్టాడు. ఫలితంగా ఓ పోలీస్ గాయపడ్డాడు. ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు మరో అధికారి కాల్పులు జరపాల్సి వచ్చింది. కార్‌లోని బాడీకెమెరాలోని ఫుటేజ్‌ చూసిన తరవాత అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది"

- పోలీస్ చీఫ్ 

2024-04-26T09:28:44Z dg43tfdfdgfd