అమ్మ పాపోయ్.. బికినీతో బస్సులోకి.. వీడియో చూసి నెటిజన్ల ఫైర్

ఢిల్లీలో కొంతమంది ప్రవర్తన.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వాళ్లు చేసే తప్పుడు పనులు.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీ మెట్రో రైళ్లలో అసభ్య ప్రవర్తనల ఘటనలు చూశాం. ఇప్పుడు ఢిల్లీ బస్సుల్లో కూడా ఇలాంటి దృశ్యాలు కామనవుతూ.. ఛిఛీ అనిపిస్తున్నాయి.

ఈ ఘటన ఢిల్లీ డీటీసీలో జరిగింది. ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీతో రావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనకి సంబంధించిన వీడియోని ట్విట్టర్ (X)లో @DELHIBUSES1 అకౌంట్ నుంచి ఏప్రిల్ 17, 2024న పోస్ట్ చేశారు. ఈ వీడియోని ఇప్పటికే 10వేల మందికి పైగా చూశారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియోని గమనిస్తే.. ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీలో వచ్చింది. ఆమెను చూసిన ఇతర ప్రయాణికులు అవాక్కయ్యారు. "ఈమె ఎవరు ఇలా వచ్చిందేంటి" అని అనుకుంటూ బిత్తరపోయారు. కొంతమంది రామ రామ అనుకుంటూ.. తమ సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. మరికొందరు.. రోజులు బాలేవు అనుకుంటూ.. తల పక్కకు తిప్పుకున్నారు. ఓ ముసలామె.. అలా వెళ్లి.. ఆ సీట్లో కూర్చో అని ఆ మహిళకు సలహా ఇచ్చింది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

చూశారుగా ఇదీ పరిస్థితి. ఆ మహిళను గమనిస్తే, ఆమె అప్పుడే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి వచ్చినట్లు ఉంది. ఆమె జుట్టు, బికినీ కూడా తడిగా ఉంది. అసలు ఆమె అలా ఎలా వచ్చింది? ఎలా బస్ ఎక్కింది? ఎందుకిలా చేసింది? ఇలా ఎన్నో ప్రశ్నలు.

ఢిల్లీ రవాణా వ్యవస్థలో DTC బస్సులు కీలకమైనవి. ఢిల్లీ మెట్రో తర్వాత ప్రజలు ఎక్కువగా ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. "లా అండ్ ఆర్డర్ ఎక్కడ? ఆమెను ఎలా అనుమతించారు" అని ఓ యూజర్ ప్రశ్నించారు. "మగవాళ్లు ఇలా చేసి ఉంటే.. ఏమయ్యేది" అని మరో యూజర్ ప్రశ్నించారు. "ఎండ 40 డిగ్రీలు ఉంటే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

2024-04-18T05:49:42Z dg43tfdfdgfd