అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు జైలులో ఉండటం వల్ల షుగర్ లెవల్స్ 320కి పెరిగాయని అందుకు ఆయనకు ఇన్సులిన్ ఇచ్చామని జైలు అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ క్రమంగా పెరుగుతుండటంతో ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం ఇదే తొలిసారి.  

ఇన్సులిన్ స్థాయి 200 దాటినప్పుడు తక్కువ మోతాదులో ఇవ్వవచ్చని AIIMS బృందం చెప్పడంతో కేజ్రీవాల్‌కు తక్కువ మోతాదులో ఇన్సులిన్ అందించినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. AIIMS నుండి ఎండోక్రినాలజిస్ట్‌లతో సహా ప్రత్యేక వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని రూస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ మెడికల్ బోర్డు అతని చెకప్ చేయడానికి మాత్రమే ఈ రోజు కూర్చుంటుందని కోర్టు స్పష్టం చేసింది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-23T06:09:56Z dg43tfdfdgfd