అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు.. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు : కేజ్రీవాల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు.. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు : కేజ్రీవాల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్  పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. కేజ్రీవాల్  అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు.. ఆయనకు బెయిల్ ఎందుకు  ఇవ్వకూడదని ఈడీని ప్రశ్నించింది.  ఎన్నికల  సందర్భంగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరంఉందని అభిప్రాయపడింది. 

 కేజ్రీవాల్ దాఖలు చేసిన  మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది.  విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  లోక్ సభ ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వస్తాయని అభిప్రాయపడింది. నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకుల పట్ల భిన్నంగా వ్యవహరించడం తమకు ఇష్టం లేదని తెలిపింది.  అయితే బెయిల్ మంజూరు చేస్తే సీఎంగా కేజ్రీవాల్  అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది.

అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది.  సీఎం అని ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదు.నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు ఎమ్మెల్యేలందరికీ బెయిల్ ఇస్తారా? -  సీఎం అయినంత మాత్రాన మినహాయింపు ఉండదు. రాజకీయ నాయకులకు మినహాయింపు ఇస్తున్నామా? ఎన్నికల ప్రచారం మరింత ముఖ్యమా. 6 నెలల క్రితం విచారణకు పిలిస్తే కేజ్రీవాల్  సొంత కారణాలతో విచారణకు రాలేదు. అతను సహకరించి ఉంటే, అరెస్టు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు.ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేయాలనుకుంటున్నాను అని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి సమన్లకు గైర్హాజరయ్యారు, ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది.సీఎం సంతకం లేకపోయినా పరిపాలన ఆగలేదు అని ఈడీ వాదించింది. ఈ కేసుపై మే 7న మధ్యాహ్నం 2.30 గంటలకు సుప్రీం  తీర్పు ఇవ్వనుంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T08:19:03Z dg43tfdfdgfd