ఆ 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి: హైకోర్టు

ఆ 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి: హైకోర్టు

ఐకేపీ, డీఆర్డీఏ ఉద్యోగులకు  హైకోర్టులో ఊరట లభించింది.  సిద్దిపేట జిల్లాకు చెందిన 106 మంది  ప్రభుత్వ ఉద్యోగులు  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అభియోగం నమోదయ్యింది. దీంతో 106 మంది ఉద్యోగులను  సస్పెండ్ చేస్తూ ఈసీ  ఉత్తర్వులు జారీ చేసింది. 

దీంతో ఎన్నికల సంఘం సస్పెన్షన్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు పదిమంది ఐకేపీ, డీఆర్డిఏ ఉద్యోగులు. పిటిషన్ పై  ఏప్రిల్ 19న  విచారించిన హైకోర్టు  ఐకెపీ, డీఆర్డిఏ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మద్యంతర ఉత్తర్వులు జారీ  చేసింది. 

ఏం జరిగిందంటే.?

సిద్దిపేటలో ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తూ ఏప్రిల్ 7న  రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్​లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి నిర్వహించిన సమావేశానికి సెర్ప్​కు సంబంధించి 14 మంది ఏపీఎంలు-, 18 మంది సీసీలు, నలుగురు వీవోఏలు , ఒక సీవో, మరో సీబీ ఆడిటర్​తో కలిపి మొత్తం 38 మంది వచ్చారు.  

అలాగే ఈజీఎస్ కు సంబంధించి -నలుగురు ఏపీవోలు, ఏడుగురు ఈసీలు, -38 మంది టీఏలు, 18 మంది సీవోలు, మరో ఎఫ్ఏతో కలిపి 68 మంది హాజరయ్యారు. ఈ విషయం వెలుగు చూడడంతో సిద్దిపేట అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో విచారణ జరిపారు. రెడ్డి ఫంక్షన్ హాల్​లో సీసీ ఫుటేజీ ఆధారంగా బీఆర్ ఎస్ మీటింగ్​లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి సస్పెండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.మను చౌదరి ఈ మేరకు ఏప్రిల్ 8న  ఉత్తర్వులు జారీ చేశారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-19T08:00:46Z dg43tfdfdgfd