ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ప్రీ-పోల్ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే.. వైసీపీ వారు వైసీపీ గెలుస్తుందని చెబుతారు.. కూటమి వారు.. కూటమి గెలుస్తుంది అంటారు. ఇందులో మనం ఎవర్నీ తప్పుపట్టలేం. ఎవరి ఒపీనియన్ వారిది. అదే విధంగా ఇప్పుడో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదో ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిపినట్లు తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్ తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సర్వేలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన తర్వాత.. ఏపీలో సీఎం జగన్‌కి వ్యతిరేక వేవ్ వచ్చిందనీ.. టీడీపీ వేప్.. అండర్ కరెంట్ లాగా ఏపీ అంతటా పాకిందని తెలిపారు. ఈ కారణంగా టీడీపీ కూటమికి 52 శాతం ఓట్లు వస్తాయనీ.. వైసీపీకి 40 శాతం వస్తాయని తెలిపారు.

కొత్త ఓటర్లు, యువ ఓటర్లు ఈసారి కూటమివైపు మళ్లినట్లు సర్వేలో తెలిపారు. అదే సమయంలో పెద్దవారు, ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు... వైసీపీకే ఓటు వెయ్యాలనుకుంటున్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ప్రీ-పోల్ సర్వే

ఉద్యోగులు, నిరుద్యోగులు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారనీ, బిజినెస్ కమ్యూనిటీ కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని సర్వేలో ఇచ్చారు.

రాజధాని అమరావతి అంశం గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

చంద్రబాబు తమ కూటమి మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత.. టీడీపీ వేవ్ మరింత తీవ్రం అయ్యిందని ఇచ్చారు.

ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత సిలిండర్ల పథకాలు.. మహిళా ఓటర్లను ఆకర్షిస్తున్నాయనీ.. అలాగే.. ఏపీలో తాగు నీటి సమస్య బాగా ఉండగా.. ప్రతీ ఇంటికీ వాటర్ ట్యాప్ వేయిస్తామని కూటమి ఇచ్చిన హామీ సైలెంటుగా ప్రభావం చూపిస్తోందని తెలిపారు.

ప్రజల్లో ఎంతో హైప్ కలిగివున్న వైసీపీ మేనిఫెస్టో... రిలీజ్ అయ్యాక.. ఆ హైప్‌ని అందుకోవడంలో ఫెయిలైందనీ.. కొత్త పథకాలు లేకపోవడం ఆసక్తిని పోగొట్టిందని తెలిపారు.

ఏపీలో రోడ్లు సరిగా లేకపోవడం, అభివృద్ధి ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయనీ.. ఇది ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని తెలిపారు.

ఈ సర్వే మొత్తం 219 పేజీలతో ఉంది. ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో కూడా పూర్తి వివరాలు ఇచ్చారు. ఐతే.. న్యూస్18 తెలుగు ఆ వివరాలు వెల్లడించట్లేదు. ఎందుకంటే.. ఇలాంటివి చెప్పి ఓటర్లను ప్రభావితం చేయకూడదనే. ఈ సర్వేతో న్యూస్18తెలుగుకి ఎలాంటి సంబంధమూ లేదని గమనించగలరు.

2024-05-06T02:14:16Z dg43tfdfdgfd