ఆహ్లాదం పంచుతున్న అర్భన్ పార్కు.. అక్కడే ఫోటో షూట్ లు కూడా..

ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి, అలసట పెరిగిపోతోంది. వీటి నుండి ఉపశమనం పొంది కాస్త సేద తీరుదామంటే నగరాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీపట్టణాల్లో అది సాధ్యమవుతుంది. అది ఎలా అంటే పట్టణాల్లో పచ్చదనాన్ని పులుముకున్న పట్టణాల్లోని పార్కులు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూ సేద తీరుస్తున్నాయి. ఇక పిల్లల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి కోసం ప్రత్యేకంగా పలు రకాలు ఆట వస్తువులు పార్కుల్లో అందుబాటులో ఉంటాయి. వాటితో ఆడిపాడి సేద తీరతారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలో గాంధీ పార్కు కూడా అలసటను దూరం చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతూ అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ పార్కులోని ప్రత్యేక ఆట వస్తువులు, పక్షుల స్థావరం, కూత పెడుతూ ముందుకు సాగే రైలు, ఎటు చూస్తె అటు పచ్చదనాన్ని పులుపుకొని నడిస్తే హాయినిచ్చే గడ్డి మైదానాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వేసవి కాలం ఆరంభంతో ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ పార్కులో కొద్దిసేపు సరదాగా గడిపి వెళుతున్నారు. పార్కు మీదుగా వెళుతున్న కొందరు గ్రామీణులు, వాహనదారులు కూడా పార్కులో ఆగి కొద్దిసేపు సేదతీరి వెళుతున్నారు.

---- Polls module would be displayed here ----

ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల క్రితం ఈ పార్కును ఏర్పాటు చేశారు. పట్టణ పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ పార్కుకు వచ్చి సేదదీరతారు. సాధారణంగా సెలవు దినాల్లో ఈ పార్కులో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవి సెలవులు కూడ దగ్గర పడుతున్నాయి. సెలవుల్లో మరింత తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇటీవల పార్కులలో కూడా సౌకర్యాలను మెరుగుపరిచారు.

పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలను పార్కు చుట్టు తిప్పి చూపించేందుకు ప్రత్యేకంగా నడుపుతున్న ట్రైన్ ఆకట్టుకుంటోంది. మరో రైలు కూడా పార్కులోని కొలను చుట్టు తిప్పుతుంది. జారుడు బల్లలు, ఉయ్యాలలు తదితర ఆట వస్తువులు ఉన్నాయి. ఉదయం పూట ప్రత్యేకంగా వాకర్స్ కూడా పార్కుకు వస్తారు. వారి కోసం వాకింగ్ ట్రాక్ ఉంది. వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్ కూడా ఉంది.

ఈ ఆఫర్స్ మీరు ఎక్కడా చూసి ఉండరు.. అతి తక్కువ ధరకే లగ్జరీ వాచ్‌లు..

ఇక్కడ యోగా సాధన కూడా చేస్తారు. ప్రత్యేకంగా వాకర్స్ కోసం పంచతత్వ పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఆహ్లాదాన్ని పంచే ఈ పార్కులో ఫోటో షూట్ లు కూడా కొనసాగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్, ప్రీ బర్త్ డే ఫోటో షూట్ల కోసం ప్రత్యేకంగా సెట్టింగులను కూడా ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టూడియో కూడా ఏర్పాతు ఏర్పాటు చేశారు. ఫోటో షూట్ ల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని వారు ఈ పార్కుకు వచ్చి తమకు కావాల్సిన రీతిలో ఫోటోలు తీసుకొని వెళుతున్నారు. ఈ ఫోటో షూట్ లకు ప్రత్యేక టికెటు తీసుకొని అనుమతి పొందుతున్నారు. ఈ ఫోటో షూట్ ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

2024-04-20T08:50:50Z dg43tfdfdgfd