ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ

ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ

  •     ఈపీటీఆర్ఐ ఆధ్వర్యంలో  సంయుక్త నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలో భూగర్భ జలాలను పెంచేందుకు మెట్రోవాటర్​బోర్డు, ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందుకు గుంతల నిర్మాణంపై ప్లంబర్స్, మేస్త్రీలకు 3 రోజుల శిక్షణను సోమవారం బోర్డు ఆఫీసులో ప్రారంభించారు. బోర్డు మేనేజింగ్ ​డైరెక్టర్​ సుదర్శన్​రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వాన నీటి సంరక్షణలో ఇంకుడు గుంతలది ముఖ్య పాత్ర అని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రజలు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

జూబ్లీ హిల్స్ లో వాటర్​బోర్డు నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ను గుర్తు చేశారు. శిక్షణలో పాల్గొనాలనుకునే వారు  8639619366  నంబర్ కు లేదా [email protected]కు మెయిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, జీఎం రాజేందర్, ఇంకుడు గుంతల నిర్మాణ ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్ కల్పన, ప్లంబర్స్, మేస్త్రీలు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T05:10:03Z dg43tfdfdgfd