ఇంటర్ ఫలితాల్లో మెరిసిన సింగరేణి బిడ్డ... 992 మార్కులతో టాప్ ర్యాంక్

విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు పునాది లాంటిది అంటారు. ఈ పునాది ఎంత దృఢంగా నిర్మించుకుంటే భవిష్యత్తు అంతా బాగుంటుందని గురువులు, పెద్దలు చెబుతూ ఉంటారు..ఐతే ఈరోజు ప్రకటించిన ఇంటర్ మీడియట్ ఫలితలలో పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు ప్రకాష్కూతురు స్ఫూర్తి అనే అమ్మాయి 992 మార్కులతో సత్తా చాటింది..గోదావరిఖని కాకతీయ జూనియర్ కాలేజీ లో చదువుతున్న స్ఫూర్తి ఇంటర్ ఫలితలలో కాలేజీ టాపర్‌గా నిలిచింది.ఈ మార్కులు సాధించడంలో తన కృషి ఎలా ఉందనే విషయం పై లోకల్ 18 స్ఫూర్తి ని పలకరించగా ఈవిదంగా చెప్పుకొచ్చింది.ఇంటర్ మీడియట్ అనేది విద్యార్థి దశకు పునాది లాంటిది అన్నారు..

Tirumala Rs 300 Darshanam Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండి ఇలా

ఈ రెండు సంవత్సరాల కస్టపడి చదివితే భవిష్యత్తు బాగుంటుందన్నారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి992 మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.పరీక్షలు రాసిన సమయంలో నేను ఎక్కువగానే స్కోర్ చేస్తాను అనుకున్నానన్నారు.ఈ మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని స్ఫూర్తి తెలిపారు.

Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

సింగరేణి కార్మికుడైనమా నాన్న నన్ను కష్టపడి చదివించారు .నాకు వచ్చిన మార్కులు చూసి మా అమ్మ, నాన్న అలాగే కుటుంబ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి కష్టమంతా నా మార్కులతోనే మర్చిపోయారని తనకు చాలా ఇష్టమైనది మ్యాథ్స్ సబ్జెక్టు అని ఎంసెట్ రాసి బీటెక్ చేసి ఇంజనీర్ అవుతానని చెబుతుంది..ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని అంటుంది. బంధువులు కళాశాల ఉపాధ్యాయులు ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారని స్ఫూర్తి న్యూస్ 18 కు తెలిపారు.

2024-04-24T11:58:42Z dg43tfdfdgfd