ఇక్కడ జూనియర్ లోబో చుట్టూ చిన్నారులు.. ఎందుకో తెలుసుకుందామా!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది జీవరాశుల మనుగడతగ్గిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంతువులన్ని జూ లకే పరిమితమయ్యాయి. మొబైల్ ఫోన్ లోకి అలవాటు పడి పిల్లలు కొంత మేరకు మానసిక ఆందోళన గురవుతున్నారు. ఇటువంటివన్నీ దూరం కావాలంటే పిల్లలను సరదాగా విశాలమైన ప్రదేశాలకు తీసుకెళ్లాలి.పిల్లలు కాలక్షేపం కోసం సరదాగా కాసేపు గడపడానికి హనుమకొండ జిల్లాలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో గత రెండు నెలలుగా జూనియర్ లోబో అనే యువకుడు విజువలైజేషన్ రిఫ్లెక్టింగ్ ఇమేజెస్ ఏర్పాటు చేసి పిల్లలను సంతోషింప చేస్తున్నారు. ఇవి జులైజేషన్ ఎఫెక్ట్ లోనిజమైన జంతువులు మన కళ్ళ ముందు తిరిగినట్టుగా.. మంచు మనపై కురుస్తున్నట్లు.. ట్రైన్ లో జర్నీ చేస్తున్నట్లుగా .. క్రిస్మస్ తాత మన పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్నట్లుగా .. జాంబీ మనతో మాట్లాడినట్టు అనుభూతి కలుగుతుందని అక్కడ చూసిన పిల్లలు చెబుతున్నారు.

స్నో వరల్డ్ చూస్తే నిజంగా మనం మంచులో తడిసిన అనుభూతి కలుగుతుందని పిల్లలు కేరింతలు కొడుతున్నారు. హైదరాబాదు లాంటి పట్టణాలకే పరిమితమైన ఈ విజువలైజేషన్ నుమన ప్రాంతంలోని పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు వెళ్లి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షోను ఏర్పాటు చేస్తున్నాం. షో ను ఏర్పాటు చేసినందుకు పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బంది నాకు సహకరిస్తున్నారని తెలిపారు.

సమ్మర్ ఎఫెక్ట్ : మంజీరా వద్ద ఈత సరదాల జోరు .. మీరు వెళ్లారా ఇక్కడికి!

దీని ద్వారా పిల్లలు కొద్దిసేపు మన ప్రపంచాన్ని మరిచిపోయి వారు కొత్త లోకానికి వెళ్లి ఆ అనుభూతిని పొందుతారు. మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తుంది.ఈ షో చూడడానికి 100 రూపాయల ఛార్జిని ఏర్పాటు చేశారు. ఈ షోను చూసిన అనుభూతి కలగకపోతే 200 రూపాయలు తిరిగి ఇస్తానని నిర్వాహకుడు తెలిపారు . ఇప్పటి వరకు లాభదాయకంగానే ఉంది. ఈ షో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులుజూనియర్ లోబో తెలిపారు.

2024-03-29T12:16:20Z dg43tfdfdgfd