ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

  • తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు       

డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ పాసైన స్టూడెంట్లు తమ హాల్ టికెట్ నెంబర్ తో దోస్త్ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగానే వారికి డిగ్రీలో సీట్లు అలాట్ మెంట్ చేస్తారు. 

ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయంటే.. 

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 13 ఉండగా.. అందులో 7500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు లో 54 కాలేజీలు అందుబాటులో ఉండగా.. 24,290 సీట్లు, సాంఘిక, గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీలు ఏడింట్లో 1840 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి 27 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా మూడు విడతల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. 

రూ. 200తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్ 3 న తొలి విడత సీట్ అలాట్ మెంట్ ఉంటుంది. జూన్ 4 వ తేదీ నుంచి 10 లోపు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4 నుంచి 13 వరకు కొనసాగనుండగా.. దీనికి రూ. 400 తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడో దశ జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంది.  రెండో దశలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి జూన్ 18 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 

జూన్ 19 నుంచి 24 వరకు విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. మూడో దశలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి జూన్ 29 సీట్ల కేటాయింపు.. జూన్ 29 నుంచి జులై 3 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలి.  అయితే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీలో మరిన్ని కొత్త కోర్సులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T01:29:53Z dg43tfdfdgfd