ఈ ఇంటర్ విద్యార్థినీ ప్రతిభకు, ఆత్మస్థైర్యానికి మెచ్చాల్సిందే...!!

ఒక పక్క కంటికి కనిపించని ప్రాణాంతకమైన వ్యాధితో నిమిషం నిమిషం పోరాటం.. వారాని రెండు సార్లు డయాలసిస్ చేస్తే కానీ ఆరోగ్యం కుదుటుగా ఉండదు. ఇది ఇలా ఉంటే మరో పక్క కటిక పేదరికం పుట్టెడు కష్టాలు పట్టెడు బాధ ,ఇన్ని సమస్యలతో బాధ పడుతున్న ఈ అమ్మాయి ఇటీవల విడుదల అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 927 మార్కులు సాధించి హృదయాలను కదిలించింది. సిరి అంత బాధతో ఎలా చదివింది ఆన్ని మార్కులు రావడానికి ఎలా కృషి చేసింది అనే విషయాలు లోకల్ 18 ద్వారా ప్రత్యేక కథనం..

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కూనారపు పోశం కనకలక్ష్మి దంపతుల మొదటి కుమార్తె కునారపు సిరి. తన 8 వ తరగతిలో ఉండగానే తనకి మూత్రపిండాల వ్యాధి ఉన్నదని వైద్యులు తెలిపారు. అప్పటి నుండి చికిత్స చేసుకుంటూనే ఇంటివద్ద ఉంటు చదువుతుంది. 10వ తరగతిలో కూడా ఇంటి వద్దే ఉంటూ చదివి మంచి మార్కులు పొందింది. ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరంలో గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఇంటి వద్ద ఉంటూ చదువుతుంది. చదువులకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు సంబంధిత అధ్యాపకులకు ఫోన్ ద్వారా సంప్రదించి ఆ డౌట్స్ కు సంబంధించిన వివరాలు పూర్తిగా సాల్వ్ చేసుకునేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ ద్వారా నేర్చుకునేది. అలా నేర్చుకుంటూనే ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించగలిగానని సిరి తెలిపింది.

దేవుళ్ల విగ్రహాలు తయారు చేయడంలో.. ఈ యువకుడు దిట్ట..

వారానికి రెండుసార్లు డయాలసిస్..

తన చదువుతో మంచి మార్కులు సాధించి అందరి హృదయాలను కదిలించిన సిరికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. మూత్రపిండాలతో బాధపడుతున్న సిరి పోరానికి రెండుసార్లు డయాలసిస్ చేయించాలి. అలా అయితేనే ఆమె ఆరోగ్యం కొంత కుదుటుగా ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్య బారిన పడినఆ బాధను పక్కన పెట్టినిత్యం చదువుతూనే ఉంటుందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

ఆమెకు అరుదైన అవకాశం.. నాడు చదివిన కళాశాలకే నేడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు..!!

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సిరికి ఇప్పటివరకు తన పేరు రేషన్ కార్డులో లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ చేయించుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన ఇప్పటివరకు సిరి పేరు రేషన్ కార్డులో లేకపోవడం పట్ల అనేక ఇబ్బందుల మధ్య అప్పులు తీసుకొచ్చి సిరికి చూపిస్తున్నామని తల్లిదండ్రులు పుట్టడు దుఃఖంతో లోకల్ 18 ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సిరి పట్ల దయ తలచి రేషన్ కార్డులో తన పేరుని ఎక్కించి ఆరోగ్యశ్రీ ద్వారా చేయించే దిశగా కృషి చేయాలని వారు కోరారు.

2024-04-25T11:17:26Z dg43tfdfdgfd