ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్

ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్

  •  హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందా
  •  రెండు మెడికల్ స్టోర్ల నుంచి కార్డినోల్ జోషాండా,కొలినాల్-SPAS  టాబ్లెట్లు స్వాధీనం 

హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందా  జోరుగా సాగుతోంది. యాడ్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ వాటిని ప్రజలకు అంటగడుతున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ మెడికల్ షాపులపై దాడులు నిర్వహించింది. యూనాని ఔషధాలు, అల్లోపతి ఔషధాల పేరుతో గుండె, ఇతర వ్యాధులకు సంబంధించిన నకిలీ మందులను విక్రయిస్తున్న రెండు మెడికల్ షాపులనుంచి నకిలీ మందులు సీజ్ చేశారు. రు.

అబిడ్స్ లోని ఎంజే మార్కెట్ లోని మెడికల్ షాఫుపై డీసీఏ అధికారులు మంగళవారం, బుధవారం (ఏప్రిల్ 24) దాడులు నిర్వహించారు. కార్డినోల్ జోషాండా, కొలినాల్-SPAS  టాబ్లెట్లను DCA  అధికారులు స్వాధీనం చేసుకున్నాయి.గగన్ పహాడ్ కు చెందిన అహ్మద్ అండ్ కంపెనీ తయారు చేస్తున్న కార్డినాల్ జోషాండా  మందులను స్వాధీనం చేసుకున్నారు. 

ఉత్తరాఖండ్ లోని vivimed Laboratiries Ltd  తయారు చేసిన Colinol SPAS టాబ్లెట్లను డ్రగ్ ఇన్ స్పెక్టర్లు గుర్తించారు. ఈ మందులను మహిళల పీరియడ్స్ సమస్యలచికిత్స కోసం వినిగిస్తారు. మధురానగర్ లోని ఓ మెడికల్ షాపులో ఈ మందుల నిల్వలు గుర్తించి స్వాధీనం చేసుకున్నా డీసీఏ అధికారులు. 

కొన్ని రకాల వ్యాధుల చికిత్స కోసం ఈ మందుల గురించి మోసపూరిత ప్రకటనలతో విక్రయిస్తున్నారు. ఇలాంటి వారికి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం 1954 ప్రకారం కఠిన శిక్షలు తప్పవని, నిందితులకు జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉందని టీఎస్ డీసీఏ DG విబి కమల్సన్ రెడ్డి చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T11:29:28Z dg43tfdfdgfd