ఈ రామారావు నాదస్వర రాగాలను పది మందికి పంచేస్తున్నారు.. మీరే చూడండి..

శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస పట్టణంకు చెందిన రామారావు నాదస్వరంలో ప్రావీణ్యత సంపాదించి టి.టి. డి దేవస్థానం యొక్క టి.టి.డి భక్తి ఛానల్ లో నాదస్వరం విద్వాంసుడిగా కొన్నాళ్లు పనిచేసారు. అలాగే కొన్ని కచేరి ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఇపుడు ఈయన తను నేర్చుకున్నవిద్య తన తోటివారికి పంచాలనే కుతూహలంతో ఆమదాలవలస పట్టణంకు దగ్గరలో ఉన్న గాజులకొల్లివలస గ్రామంలో ఉన్న సంగమేస్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో పిల్లకు ఉచితంగా నాదస్వరం విద్యను నేర్పిస్తున్నారు.

వీరి దగ్గర సుమారు 30 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరు అందరూ శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీరికి ఉండటానికి కావాల్సిన వసతి సదుపాయాన్ని కూడా వీరు కల్పిస్తున్నారు. సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళ ప్రథమమైనదిగా భావించారు. దేవాలయాల్లోనూ మత, సామాజికపరమైన కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం ఈ నాదస్వరం.

కచేరీలలో విరివిగా ఉపయోగించు వాద్యం కూడా ఇది. దక్షిణభారతంలో కర్నాటక సంగీతానికి పొడవైన సన్నాయిని వాడితే ఉత్తర భారతంలో హిందుస్తానీ సంగీతానికి పొట్టిదైన షెహనాయిని వాడతారు. పురాణాల నుండి ఈ వాద్యముని వాయించడానికి ప్రత్యేకమైన తెగ ఉన్నది, వారిని నాద బ్రాహ్మణులు, మంగళకారులు అని సంబోధించేవారు.

Farmer News: రైతన్నలకు అదిరే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇక డబుల్ ఆదాయం..

అందుకే మంగళవారు వాయించే వాద్యము కనుక నాదస్వరాన్నే సన్నాయి అని తెలుగు ప్రజలు పిలుస్తారు. సన్నాయి వాయించే సామాజిక వర్గాన్ని నాయి బ్రాహ్మణులుగా వ్యవహరింప చేసి, వారికి ఒక సామాజిక గౌరవాన్ని సంతరించుకుంది. ఈ నాదస్వరం నేర్చుకునే పిల్లలు రాను రాను తగ్గిపోతున్నారు. నాయి బ్రాహ్మణులు పిల్లలు వాళ్ళ కుల వృత్తి ఆయన సన్నాయిని నేర్చుకోకుండా బిటెక్ వంటి చదువులు చదవడం ఉపాధి కోసం వేర్వేరు ఉద్యోగాలు పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచితంగా పిల్లలకు సన్నాయిని విధ్వంషులుగా తీర్చిదిద్దుతున్న రామారావు లాంటివారు ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితులుకు అవసరం ఎంతైనా ఉంది.

2024-05-05T15:12:27Z dg43tfdfdgfd