ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం బారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం పడ్తోంది. రఘునాథ పెళ్లి మండలం కోడూరులో పిడుగు పడి దాసరి అజయ్ అనే 23  యువకుడు చనిపోయాడు. అక్కడ ఉన్న యువకుడి తల్లి రేణుక తృటితో తప్పించుకుంది. పిడుగుపాటులో  అజయ్ తో సహా రెండు గేదెలు కూడా చనిపోయాయి. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో వడగళ్ల వాన పడ్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడగూడెంలో పిడుగు పాటుకు బాస బుల్లోడు (46)అనే రైతు మృతి చెందాడు. నల్గొండ, ములుగు జిల్లాల్లో కూడా బారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈరోజు నుంచి వర్షాలు స్టార్ట్

ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రేపు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. 

ఎక్కడెక్కడంటే

ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు మెదక్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నెల 8న కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మే 9న హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ సహా ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-05T13:43:03Z dg43tfdfdgfd