ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

కోరుట్ల, వెలుగు: ఎండ వేడిమితో అస్వస్థతకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. ఇందుకు సకాలంలో వైద్యం అందించకపోవడం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు హాస్పిటల్‌‌‌‌ ఫర్నిచర్‌‌‌‌ను ధ్వంసం చేయడంతో పాటు డాక్టర్‌‌‌‌, డ్యూటీ స్టాఫ్‌‌‌‌పై చేయి చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని హాజీపురకు చెందిన నజీబ్‌‌‌‌ ఉర్‌‌‌‌ రహ్మాన్‌‌‌‌ అలియాస్ ముజ్జు (46) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఎండ వేడిమి కారణంగా ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు గమనించి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు.

 డ్యూటీలో ఉన్న స్టాఫ్‌‌‌‌ నర్సు ముజ్జును పరీక్షించి డ్యూటీ డాక్టర్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. డాక్టర్‌‌‌‌ వచ్చి చూసి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. అయితే స్టాఫ్‌‌‌‌ నర్సు, డాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యం కారణంగానే ముజ్జు చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌‌‌‌లో ఫర్నిచర్‌‌‌‌ను ధ్వంసం చేయడంతో డాక్టర్‌‌‌‌, స్టాఫ్‌‌‌‌పై చేయిచేసుకున్నారు. 

పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని హాస్పిటల్‌‌‌‌ సిబ్బంది తెలిపారు. దీంతో తీవ్ర ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ సురేశ్‌‌‌‌బాబు, ఎస్సైలు శ్యాంరాజ్‌‌‌‌, నవీన్, చిరంజీవి, ఆరీఫ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు చేరుకొని బందోబస్తు చేపట్టారు. కంప్లైంట్ ఇస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:00:06Z dg43tfdfdgfd