ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు

ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు

  • తెలంగాణ జాగో, ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర షురూ

హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో ప్రజలను జాగృతం చేసేందుకు మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరోసారి సిద్ధమయ్యారు. తెలంగాణ జాగో, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం, సమస్యలపై ప్రశ్నించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం వంటి అంశాలు ఈ యాత్రలో ఉన్నాయి.

 సెక్రటేరియెట్​ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సు యాత్రను హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించారు. ఈ యాత్రలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్​ అల్తాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. బుధవారం యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పూర్తి కాగా.. గురువారం మెదక్ , శుక్రవారం నిజామాబాద్, శనివారం ఆదిలాబాద్ లో సాగనుంది. 

ఈ నెల 11 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. రాజ్యాంగ హక్కులను కలరాస్తూ మతాల పేరుతో ప్రజలను విభజించి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని మాజీ ఐఏఎస్, బస్సు యాత్ర కన్వీనర్  ఆకునూరు మురళి అన్నారు. గత 10 ఏండ్ల నుంచి అంబానీ, అదానీకి దేశ సంపదను మోదీ పంచి పెడుతున్నారని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ దుయ్యబట్టారు.   

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T01:44:24Z dg43tfdfdgfd