ఎన్నికల నామినేషన్లు దాఖలుకు నేడు లాస్ట్ డేట్.. మిస్ అయితే పోటీ చేసే ఛాన్స్ కోల్పోయినట్లే

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు చేసింది. రేపు అనగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ ల ఉపసంహరణకు ఈనెల 29వ తేది వరకు గడువు ఉంది. వచ్చే నెల 13 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల ప్రకటిస్తారు.

ఈ ఒక్క రోజే గడువు..

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. అయితే పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్ వేయడానికి ఈరోజే చివరి గడువు. ఈరోజుతో నామినేషన్ పత్రాలు సమర్పించని వారు పోటీకి అనర్హులుగా ఉంటారు. ప్రచారంలో బిజీగా ఉన్న నాయకులు నామినేషన్లు వేయాలని గుర్తు చేస్తోంది. రేపు అనగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ ల ఉపసంహరణకు ఈనెల 29వ తేది వరకు గడువు ఉంది. వచ్చే నెల 13 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల ప్రకటిస్తారు.

Loksabha Elections 2024: బీజేపీ ఎంపీ అభ్యర్ధికి వేల కోట్ల ఆస్తులు.. లోక్ సభ ఎన్నికల్లో శ్రీమంతుడు ఇతనే

రేపు నామినేషన్ల పరిశీలన...

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్ని ఒకే విడతలో నిర్వహిస్తోంది ఎన్నికల కమిషన్. దేశ వ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ ఏపీ, తెలంగాణతో పాటు బీహార్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పోటీకి అంతా రెడీ..

అసెంబ్లీ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ...లోక్ సభ ఎన్నికలపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీలు ఫోకస్ పెట్టాయి. మూడో సారి అధికారంలోకి రావాలని బీజేపీ..ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

2024-04-25T01:00:40Z dg43tfdfdgfd