ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడండి: డీజీపీకి పీసీసీ ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ విజ్ఞప్తి

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడండి: డీజీపీకి పీసీసీ ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ రవిగుప్తను టీపీసీసీ ఎన్నికల మెనేజ్మెంట్ కమిటీ కోరింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. శనివారం డీజీపీని కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కలిశారు. అన్ని ప్రాంతాల్లో సరైన భద్రత సిబ్బందిని నియమించాలన్నారు. 

శాంతి భద్రతల దృష్ట్యా సున్నితమైన ప్రాంతాల్లో ఎక్కువ బలగాలను మోహరించి... ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించాలని తెలిపారు. మతం పేరుతో రెచ్చగొడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. సోషల్ మీడియాలో  ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వ్యక్తులపై సైబర్ సెక్యూరిటీ యాక్ట్  ప్రకారం కేసులు నమోదు చేయాలని డీజీపీని రిక్వెస్ట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కత్తి వెంకటస్వామి , దివ్య వాణి , మాజీ మంత్రి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-28T03:28:52Z dg43tfdfdgfd