ఎమ్మెల్యే కాకున్నా హరీశ్‌‌‌‌‌‌‌‌ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ది : బండి సుధాకర్ గౌడ్

ఎమ్మెల్యే కాకున్నా హరీశ్‌‌‌‌‌‌‌‌ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ది : బండి సుధాకర్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కాకున్నా.. హరీశ్‌‌‌‌‌‌‌‌రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీదని, ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను రెచ్చగొట్టేందుకు ఒంటిమీద పెట్రోల్ పోసుకొని, అగ్గిపెట్టె మర్చిపోయిన చరిత్ర హరీశ్ రావుదని శుక్రవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టడంతోనే 1,200 మంది అమరులయ్యారని, అందులో కేవలం 400 మందిని ఆదుకొని, మిగతా 800 మందిని గత ప్రభుత్వం విస్మరించిందన్నారు.

 అమరుల త్యాగాల పునాదుల మీద రాజ్యమేలి రాక్షసానందం పొందిన మీకు అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా డ్రామాలాడే నైతిక హక్కు లేదన్నారు. మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే, రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 

సీఎం రేవంత్ రెడ్డి పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతారని, హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు చౌకబారు ప్రయత్నాలు మాని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన హితవు పలికారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T04:55:08Z dg43tfdfdgfd