ఏ దేవతలకు లేనట్టుగా ఒక్క హనుమంతుడికి మాత్రమే రెండు జయంతి వేడుకలు ఎందుకు? తెలుసుకోండి

దేశంలో ఏ దేవునికి లేని రెండు జయంతులు ఒక్క హనుమాన్‌కి మాత్రమే ఉంటాయి. హనుమాన్ జయంతి నాడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్టసమయాల్లో ఆపద్భాందవుడిగా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజును హనుమాన్ చిన్న జయంతిగా జరుపుకుంటారు.

ఈ రెండు జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరాముని ధూత. అంతేకాదు ఆయన్ను తన గుండెల్లో పెట్టుకొని పూజించే భక్తుడు కూడా. శ్రీరామ భక్తుల్లో హనుమంతుడిదే ప్రధమస్థానం. సీతాదేవి జాడను కనుగొని రాముడి బాధను తొలగించాడు. రావణాసురుడు లంకానగరాన్ని దహనంగావించి భూతప్రేత పిశాచాలను భయపెట్టాడు. అందుకే ఆయన్ను కొలిస్తే బాధలు తీరిపోతాయని, కష్టాలనుంచి గట్టెక్కిస్తాడని, భయాందోళనలు తొలగిపోతాయనిభక్తులు నమ్ముతారు.

Hanuman Jayanti: ఇవాళ హనుమాన్ జయంతి కాదా? మరి ఈరోజు విశిష్టత ఏంటీ? అర్చకుని మాటల్లో వినండి

వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్ధశి రోజున స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఆ తేదీని హనుమంతుడి జన్మదినంగా జరుపుకుంటారు. అయితే, చైత్రమాసం పౌర్ణమి రోజున కూడా హనుమాన్‌ జయంతిని జరుపుకుంటారు. చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమాన్‌ జయంతి జరుపుకోవడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉందని కొండగట్టు ఆలయ అర్చకులు రమణ మహర్షి అంటున్నారు.

హనుమంతుడు బాల్యంలో సూర్యుడిని చూసి పండు అనుకొని తినడానికి వెళ్లగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని దండిస్తాడు. తన కుమారుడిని దండించిన సంగతి వాయుదేవుడికి తెలుస్తుంది. ఆయన ఆగ్రహించి ఉగ్రరూపం దాల్చి గాలిని నిలిపివేస్తాడు. దీంతో భూమండలంపై ఉన్న జీవులు గాలిలేక అల్లాడిపోతాయి.

Kondagattu Temple: ఆవు తప్పిపోయింది... ఆంజనేయుడు కలలోకి వచ్చాడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ... వాయుదేవుడి కోపాన్ని చల్లారుస్తాడు. హనుమంతుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. చైత్రమాసంలోని పౌర్ణమి రోజున ఈ సంఘటన జరిగింది. హనుమంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించిన రోజు కావడంతో... ఆరోజున కూడా హనుమాన్‌ జయంతిని జరుపుకుంటారు. ఇలా హనుమంతుని రెండు జయంతులను జరుపుకోవడం అవును అయితే వస్తుందని ఆలయ అర్చకులు రమణ మహర్షి లోకల్ 18కి తెలిపారు.

2024-04-23T04:38:51Z dg43tfdfdgfd