ఏకంగా రూ.50 వేలు.. రైతులకు గుడ్ న్యూస్, ఇలా చేస్తే చాలు!

వర్షా కాలంలోనే కాదు ఎండాకాలం అయినా సరే పొలంలో పంటలను పండించి అధిక లాభాలు పొందవచ్చునని ఈ రైతన్న నిరూపిస్తున్నాడు. ఎండాకాలంలో అధికంగా నూతన గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, జాతరలు నిర్వహిస్తుంటారు. అధిక మెుత్తంలో కూరగాయాలు సేల్స్ అవుతాయని తాము విజిటేబుల్స్ పండిస్తున్నామని తెలుపుతున్నారు. అసలు వీరు ఎంత మెుత్తంలో వీటి సాగుచేస్తున్నారు. అమ్మకాలు ఎలా చేస్తున్నారు. లాభాలు ఎలా ఉన్నాయనే విషయాలు లోకల్ 18తో రైతు పంచుకున్నారు. ఆ విషయాలేంటో చూడండి.

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామం అది. ఓ రైతు తన రెండు ఎకరాల భూమిలో వివిధ రకాల కూరగాయల పంటలను పండిస్తూ అందరిని ఔరా అనిపిస్తున్నారు. ఈ రైతు పేరు రామన్న గౌడ్. తనకు ఉన్నరెండు ఎకరాలలో భూమిలోగోంగూర, బెండ, మటిక (గోరు చిక్కుడు), బుడ్డలు ఇలా రకరకాల కూరగాయలను పండిస్తూ మార్కెట్లో అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. అదే విధంగా రెండు ఎకరాలకు వచ్చేసి 20 నుంచి 25 వేలు ఖర్చు వచ్చిన మంచి సీజన్లో అయితే ఈ రెండే ఎకరాల పైన 50 వేల రూపాయలు లాభం వస్తుందని తెలియజేశారు.

చదువు అక్కర్లేదు.. ఈ వ్యాపారంతో నెలకు రూ.20 వేలు పొందొచ్చు!

అదే విధంగా  కూరగాయల పంటలను దాదాపుగా న్యాచురల్ గానే పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఊరికి అందుబాటులో ఉంటూ ఊరిలో ఏదైనా వివాహ వేడుకలు ఉంటే తనకు ముందస్తుగా మనం తెలియచేస్తే హోల్ సేల్ ధరలకే కూరగాయలను సప్లయ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల తనకు రవాణా ఛార్జీలు తగ్గుతాయి. డ్రైవర్ మాములు ఇవ్వనవసరం లేదని చెబుతున్నారు.

మహిళలు, మగవారు, స్టూడెంట్స్‌‌కు డబ్బే డబ్బు.. ఇలా చేస్తే రూ.లక్షల్లో సంపాదన!

కొనుగోలుదారులకు కూడా శ్రమ తగ్గించిన రైతును అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. లేకుంటే వారు దూర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసేవారనన్నారు. చాలా మంది తమ వద్ద కొనుగోలు చేసేవారన్నారు.లేకుంటే రైతులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి మార్కెట్లోకి అమ్మకాలు జరుపుతూ ఉంటారు. మార్కెట్లో అమ్మకాలు జరిపిన మంచి ఆదాయం వస్తూ ఉంటుందన్నారు.ఏది ఏమైనా మార్కెట్లో కూరగాయలు తక్కువగా ఉంటే రైతుకు అధికంగా లాభాలు వస్తాయి. మార్కెట్లో కూరగాయలు ఎక్కువగా ఉంటే రైతన్నకు ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని తెలియజేశారు. అదే విధంగా పెళ్లిళ్ల సీజన్లో అయితే, అధిక ఆదాయాన్ని పొందవచ్చునని రైతు రామన్న గౌడ్ లోకల్ 18 ద్వారా తెలిపారు.

2024-05-02T04:29:11Z dg43tfdfdgfd