ఏజన్సీ ప్రాంతాలలో ఐక్యతా రాగం.. ఆధ్యాత్మికతే మూలం అంటున్న గిరిజనులు !

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు కూడలిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇక్కడి ప్రజలు యేడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం, వేడుకను జరుపుకుంటూనే ఉంటారు. అవి ఇక్కడి ప్రజల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకలు, ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పల్లెల్లో సందడి నెలకొంది. మరోవైపు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీఠవేసె ఆదివాసి గిరిజనులు కూడా తమ గూడెల్లో ఆధ్యాత్మిక వేడుకలను జరుపుకుంటున్నారు. విశిష్టమైన సంస్కృతిని కలిగి ఉన్న ఇక్కడి ఆదివాసులు కూడా తమదైన శైలిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

---- Polls module would be displayed here ----

కాగా ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం ఖైర్ దాట్వా గ్రామంలోని ఆదివాసి గిరిజనులు భక్తి శ్రద్దలతో అఖండ హరినా సప్తాహా వేడుకలను జరుపుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తన, ప్రత్యేక పూజలు, ప్రవచన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమోకా గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక గురువు కోరెంగ యశ్వంత్ రావు మహారాజ్ నేతృత్వంలో ఈ సప్తాహా కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రామస్థులు ప్రత్యేకంగా ఉపవాస దీక్షను కూడా పాటిస్తున్నారు.

గూడేనికి చెందిన ఒక్కో కుటుంబం ఒక్కోరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సప్తాహాలో భాగంగానే మడావి వంశానికి చెందిన గిరిజన కుటుంబం ఊరిలోని ఆలయానికి ఓ గోవును దానంగా అందజేసి మొక్కులు తీర్చుకుంది. అయితే గూడెం పెద్దలైన పటేల్, దేవరిల ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారని, తమ పెద్దల అడుగుజాడల్లోనే ఊరి యువకులు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కలిసి వచ్చారని ఆ గ్రామానికి చెందిన యువకుడు మడావి మారుతి న్యూస్ 18తో తెలిపారు.

Ground Water: చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు.. ఇవి నీటి జాడను చెబుతాయా..

ఇదిలా ఉంటే కొన్ని ఏళ్లుగా జిల్లాలోని పలు గ్రామాలు ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ మద్యం, మాంసాలకు దూరంగా ఉంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. అందులో గిరిజన గూడాలు కూడా ఉన్నాయి. కాగా ఊరు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్దిగా పండాలని కోరుతూ, వ్యాధులు దరిచేరకుండా ఉండాలని కోరుతూ ఇలా గిరిజన గూడాల్లోనే కాకుండా జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుండటం విశేషంగా చెప్పవచ్చు.

2024-04-23T14:40:27Z dg43tfdfdgfd