ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం.. కూటమి, వైసీపీ అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచార వేడి కనిపిస్తోంది. ప్రచారానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు బిజీ అయ్యారు. రోజూ సభలు, సమావేశాలు, రోడ్ షోలతో దూకుడు పెంచారు. అయితే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నా.. ఎదురుపడితే మాత్రం ఆత్మీయతను పంచుకుంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయ రణరంగంలో ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకన్నారు.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం ఎన్డీఏ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాలకొల్లులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు ఎదురు పడ్డారు. సోదరభావంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఉమాబాలతో కరచాలనం చేశారు. రాజకీయాలను సీరియస్‌గా తీసుకుని.. ప్రత్యర్థులుగా ఉన్నవారిని కనీసం పలకరించుకునే పరిస్థితులు కొన్నిచోట్ల ఉండవు. కానీ ఇక్కడ మాత్రం రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులమని నేతలు నిరూపించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T02:13:28Z dg43tfdfdgfd