ఏపీ తాగునీటి కోటా పూర్తి

ఏపీ తాగునీటి కోటా పూర్తి

  • నీటి విడుదల ఆపేయాలని కేఆర్​ఎంబీ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు : తాగునీటి కోసం ఏపీకి కేటాయించిన కోటాను ఆ రాష్ట్రం పూర్తిగా వాడేసుకుంది. దీంతో నాగార్జునసాగర్​ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను ఆపేయాల్సిందిగా ఏపీని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ఈఎన్​సీకి లేఖ రాసింది. ఈ నెల 12న జరిగిన బోర్డు త్రీ మెంబర్​ కమిటీ మీటింగ్​లో ఏపీకి 5.5 టీఎంసీలను తాగునీటి కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అదే రోజు నుంచి మంగళవారం వరకు నీటిని విడుదల చేసుకున్నది. ఈ 12 రోజుల్లో మొత్తం 5.5 టీఎంసీల నీటిని ఏపీ వాడుకున్నట్టు బోర్డు వెల్లడించింది. ఏ రోజు ఎంతెంత వాడుకున్నారన్న లెక్కలనూ విడుదల చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T04:13:21Z dg43tfdfdgfd