ఏపీలో పథకాల అమలుకు అడ్డు తగులుతున్నది మీరంటే మీరంటూ.. పార్టీల విమర్శల జోరు !

ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక.. ప్రవేశపెట్టిన పథకాలు కాదు. మొన్నటి మొన్న అమలు చేసిన పథకాలు కానే కాదు.. కానీ ఇదేందయ్యా మీ గోల అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వైసిపి ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య ప్రజానీకానికి చేరకుండా.. టిడిపి అడ్డుతగులుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ తాము ఎన్నికల నియమావళి మేరకే ఈసీ కి ఫిర్యాదులు ఇస్తున్నట్లు మరో వైపు టిడిపి చెబుతోంది. ఇది ఏపీలో ఎన్నికల సంధర్భంగా ఉన్న అనిశ్చితి.

వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రవేశ పెట్టిన పథకాలు పేదలకు అందకుండా టిడిపి అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈసీ ఎంతో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ఎక్కడ ఫిర్యాదు అందుకున్నా.. దానికి తగ్గ చర్యలు తీసుకోవడంలో ఈసీ తన పాత్ర పోషిస్తోంది. కాగా పలు ఫిర్యాదులతో రైతులకు అందే సబ్సిడీ, విధ్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇలా పలు పథకాలు చేరని పరిస్థితి ఉందని, ఇటువంటి పథకాల అమలుపై ఈసీ దృష్టి సారిస్తే బాగుంటుందని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Tirumala Annadanam: తిరుమలలో ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఎన్నికల కోడ్ వచ్చాక అమలు చేసిన పథకాలు ఏవి లేవని, ముందుగా అమలవుతున్న పథకాలను ప్రజలు పొందేలా చూడాలని వైసీపీ విన్నవిస్తోంది. ప్రతి విషయం ను భూతద్దం లో చూస్తూ ప్రజలకు అందే పథకాలను అడ్డు తగిలే విధానాన్ని టిడిపి మానుకోవాలని వైసీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నదే తమ భావనగా టిడిపి ఆ విమర్శలను తిప్పి కొడుతున్న పరిస్థితి ఉంది.

Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

అంతేకాదు ఇటీవల సామాజిక పింఛన్ పంపిణీ సమయంలో కూడా.. వృద్దులు, వితంతువులు పింఛన్ పొందేందుకు టిడిపి చేసిన నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైసిపి విమర్శలు గుప్పించింది. అందుకు తగ్గ రీతిలో వైసీపీ సోషల్ మీడియా వృద్దుల మాటలను సామాజిక మాధ్యమాలలో మారు మ్రోగించింది. అదే రీతిలో టిడిపి సైతం కావాలనే తమపై బురద చల్లేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుందని, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని టిడిపి సోషల్ మీడియా ఆ విమర్శలను తిప్పికొడుతోంది. ఇలా పథకాల సెంటర్ ఆఫ్ యాక్షన్ గా టిడిపి, వైసిపి విమర్శల పర్వం సాగిస్తుండగా.. ఎన్నికల కమిషన్ మాత్రం పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తగ్గేదేలే.. మాకు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ముఖ్యమని రాష్ట్ర వ్యాప్తంగా నిఘా కేటాయించారు.

2024-05-07T09:18:25Z dg43tfdfdgfd