ఏప్రిల్ 1 నుంచి సామాన్యులకు భారీ షాక్.. కేంద్రం కీలక నిర్ణయం!

జనాభా ప్రాధాన్యత, ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేవి ఎసెన్షియల్ మెడిసిన్స్. వ్యాధి వ్యాప్తి, సమర్థత, భద్రత, ధరను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందిస్తారు. ఇటువంటి మందులు తగిన మోతాదులో, క్వాలిటీతో అందుబాటులో ఉండాలి. ప్రజలు భరించగలిగే విధంగా అందుబాటులో ఉండాలి.
అయితే ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి ముఖ్యమైన మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. హోల్‌సేల్ ప్రైస్‌ ఇండెక్ష్‌(WPI)లో మార్పులకు అనుగుణంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) కింద లిస్ట్‌ అయిన మెడిసిన్ ధరలు 0.0055% వరకు పెరగనున్నాయి.

స్వలంగా పెరిగిన ధరలు

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) నివేదిక ప్రకారం.. ఈ ధరల అడ్జస్ట్‌మెంట్లు మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నిర్ణయించే హోల్‌సేల్ ప్రైస్‌ ఇండెక్స్‌ డేటాపై ఆధారపడి ఉంటాయి. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరానికి WPIలో 0.00551% స్వల్ప పెరుగుదలను చూపుతుంది.

ముఖ్యమైన మెడిసిన్

ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోని కొందరికి ఈ పెరుగుదల గణనీయంగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో మెడిసిన్ ధరలు వరుసగా ఇంకతంటే ఎక్కువగా పెరిగాయి. అయితే ఇవి తక్కు ధరలో అందుబాటులో ఉండటానికి కీలక చర్యలు అవసరమని ప్రభుత్వేతర సంస్థల (NGOలు) ప్రతినిధులు భావిస్తున్నారు.

ముఖ్యమైన మెడిసిన్

ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోని కొందరికి ఈ పెరుగుదల గణనీయంగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో మెడిసిన్ ధరలు వరుసగా ఇంకతంటే ఎక్కువగా పెరిగాయి. అయితే ఇవి తక్కు ధరలో అందుబాటులో ఉండటానికి కీలక చర్యలు అవసరమని ప్రభుత్వేతర సంస్థల (NGOలు) ప్రతినిధులు భావిస్తున్నారు.

2022లో NLEM లిస్ట్

2022లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) 2022ని ప్రారంభించారు. ప్రధాని మోదీ 'సబ్కో దవాయి, సస్తీ దవాయి (Sabko Dawai, Sasti Dawai)' ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. అన్ని స్థాయిల ఆరోగ్య సంరక్షణలో సరసమైన, నాణ్యమైన మందులను పొందడంలో NLEM కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ లిస్టులో మొత్తం 384 రకాల మెడిసిన్ ఉన్నాయి, ఇందులో కొత్తగా 34 చేర్చారు. అంతకు ముందున్న 26ని తొలగించారు. కాస్ట్‌-ఎఫెక్టివ్‌, క్వాలిటీ మెడిసిన్స్‌ అవైలబిలిటీని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం జాబితాను రూపొందించింది. ఈ మందులు 27 చికిత్సా వర్గాలను కవర్ చేస్తాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు జేబు నుంచి పెట్టే ఖర్చును తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ.. సమర్థత, భద్రత, నాణ్యత, మొత్తం చికిత్స వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని, 'అత్యవసర ఔషధాలు(Essential Medicines)' ప్రాధాన్యతా ఆరోగ్య అవసరాలు తీర్చగలవని చెప్పారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

2024-03-29T09:46:08Z dg43tfdfdgfd