ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

న్యూఢిల్లీ: సర్వీసెస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించింది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  మంత్లీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలకు గాను 60.8 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో  ఇది 61.2 గా ఉంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌లు 14 ఏళ్లలో ఎప్పుడూ లేనంత  వేగంగా వృద్ధి చెందుతున్నాయని, ఉత్పత్తి పుంజుకుందని  హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీసీ పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

 పీఎంఐ 50 పైన నమోదైతే  సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు.  డిమాండ్ బాగుందని,   కొత్త ఆర్డర్లు వస్తున్నాయని హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రంజుల్‌‌‌‌‌‌‌‌  భండారియా అన్నారు.  కొన్ని కంపెనీలు తమ ఉద్యోగ నియామకాలను పెంచాయని పేర్కొన్నారు. కానీ, చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులు సరిపోతారని వెల్లడించారని అన్నారు.  ఉద్యోగాల కల్పన పెద్దగా పెరగలేదని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T01:18:01Z dg43tfdfdgfd