కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం

కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: కూకట్ పల్లిలోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి పరిధిలోని సాయినగర్ లో ఓ స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన సిలిండర్ పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న స్క్రాప్ కు అంటుకుని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్, పోలీసు లకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పివేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన చిన్న సిలిండర్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటా గాయాలు కాలేదు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T08:08:14Z dg43tfdfdgfd