కరోనా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకడుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది.ఈ వైరస్ ద్వారా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వైపు ఎదురు చూసింది. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఎందరో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఎట్టకేలకు శాస్త్రవేత్తల కృషి ఫలించింది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టారనే వార్త అందరికీ ఆనందాన్ని కలిగించింది.భారత్ కూడా స్వయంగా వ్యాక్సిన్ ను కనిపెట్టి ప్రపంచానికి పంచింది.

అయితే ఈ కరోనా వ్యాక్సిన్ కోసం కోట్లాది ప్రజలు క్యూ కట్టారు. మొదటి డోస్,రెండోవ డోస్ మరి కొంతమంది బూస్టర్ దోస్ కూడా వేయించుకున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ గతంలో చాలా వార్తలు రావడంతో ఇవన్నీ పుకార్లు అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా కోవి షీల్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనక సంస్థ యూకే కోర్టులో సమర్పించిన నివేదిక ఒక్కసారిగా వ్యాక్సిన్ వేయించుకున్న కోట్లాది మంది ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది.

ఉపాధి హామీ పథకం కింద రూ.50 వేలు.. కరువు పనికి వెళ్లే వారికి గుడ్ న్యూస్!

ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో టిటిఎస్(త్రోమ్బోసిస్ విత్ త్రోమ్బో సైటోపెనీయ సిండ్రోమ్) లక్షణాలు కనిపిస్తాయిని వెల్లడించింది.శరీరంలోని వివిధ భాగాల్లో రక్తం గడ్డ కట్టడం వంటివి ఏర్పడుతుందని తేల్చిచెప్పింది. కానీ ఇది అందరిలో కాకుండా చాలా అరుదుగా వస్తుందన్నారు. అయితే ఆస్ట్రేజెనిక సంస్థ చేసిన ఈ ప్రకటన వ్యాక్సిన్ తీసుకున్నవారిలో భయాందోళనలు రేపుతోంది.ప్రజల భయాందోళనాలను వైద్య నిపుణులు కొట్టిపరేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ 45 రోజుల లోపు మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయని కానీ ఇంత లాంగ్ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ లోకల్18కు తెలిపారు.

తిరుమల వెళ్తున్నారా.. ఆన్‌లైన్‌లో గదులు దొరక్కపోతే ఇలా చేయండి, మీకు రూమ్ పక్కా..

మధుమేహం,అధిక రక్తపోటు, పొగాకు వాడేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని అలాంటి వారు క్రమంగా గుండె పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా అరుదుగా చూపించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా తక్కువేనని,అంతకంటే ఎక్కువ ఈ వ్యాక్సిన్ ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ప్రజలు ఎలాంటి అపోహలు, భయాందోళనకు గురి కావద్దని సూచించారు..

2024-05-04T01:36:37Z dg43tfdfdgfd