కళ్యాణం కమణీయం... అహోబిలం శ్రీ లక్ష్మినరసింహాస్వామి బ్రహ్మోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా చివరి రోజు అయిన దిగువ అహోబిలంలో అంగరంగ వైభవంగా అశేష జన వాహిని మధ్యలో గరుడ వాహనంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరుదులుగా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులను అనుగ్రహించాడు.
ఆళ్లగడ్డ పట్టణంలోని దట్టమైన అడవుల నడుమ వెలసిన శ్రీ మహ విష్ణువు అవతార రూపుడు అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలా సందర్బంగా దిగువ అహోబిలంలో గరుడవాహనంపై స్వామి వారి ఉత్సవమూర్తిని ఉంచి ఆలయం పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు...
ఉగ్ర నరసింహ అవతార రూపుడైనా అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున అహోబిలానికి చేరుకుని స్వామి వారి పల్లకి సేవలో పాల్గొన్నారు...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవం ముగిసిన అనంతరం శ్రీ భూ దేవేరులతో శ్రీ ప్రహ్లాద వరద స్వామికి ఆలయం ముందు ఉన్న పుష్కరిణిలో స్వామివారు తెప్పోత్సవం నిర్వహించారు. మొదటి రోజు కావున ఐదు రౌండ్ల తిప్పను పుష్కరినిలో తెప్పోత్సవం నిర్వహించారు...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామికి, శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ అమృతవల్లి అమ్మవారికి కల్యాణోత్సవం ముగించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

2024-03-28T05:43:43Z dg43tfdfdgfd