కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ఢిల్లీ  లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు మరోసారి నిరాశ ఎదురయ్యింది. కవిత రెండు బెయిల్ పిటిషన్లను  ట్రయల్ కోర్టు కొట్టేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను న్యాయమూర్తి కావేరి బవేజా డిస్మిస్ చేశారు. 

లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగించగా..మే 6న తీర్పు వెల్లడించింది ట్రయల్ కోర్టు.

లిక్కర్ స్కాం వ్యవహారంలో 2024  మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న తనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. కవిత మహిళ కనుక బెయిల్​కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. అప్రూవర్ల స్టేట్మెంట్లే తప్ప.. సరైనా ఆధారాలు లేనందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. . కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని.. అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు అడ్వకేట్లు కోరారు. మరోవైపు, కవితకు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7తో ముగియనుంది. దీంతో గత ఆదేశాల మేరకు ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T07:00:43Z dg43tfdfdgfd