కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా

మోదీ మళ్లీ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కు  మూడో స్థానం పక్కా అని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.  నిజామాబాద్ సభలో మాట్లాడిన అమిత్ షా.. ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు.  బీజేపీ ఎప్పుడు  ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోదన్నారు. రామమందిర  నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులు తోకముడిచారని అన్నారు. పాక్  గడ్డపైకి వెళ్లి  సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ కలలు కంటున్నారని అన్నారు.

కశ్మీర్.. భారత్ లో  అంతర్భాగం అవునా?.. మరి  అక్కడ ప్రత్యేక రాజ్యాంగం ఎందుకు అమలయ్యిందని ప్రశ్నించారు అమిత్ షా.  మోదీ వచ్చాక కశ్మీర్ లో జాతీయ జెండా సగర్వంగా ఎగురుతోందన్నారు.  దేశంలో జీఎస్టీ అమలవుతుంటే.. తెలంగాణలో ఆర్ఆర్.. రాహుల్, రేవంత్  ట్యాక్స్ అమలవుతోందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని.. లక్షల కోట్లు ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. అర్వింద్ ఒత్తిడి వల్లే పసుపు బోర్డు ప్రకటించారని చెప్పారు. అర్వింద్ ని మళ్ళీ గెలిపిస్తే బీడీ కార్మికులకు ఆసుపత్రి, షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T13:12:58Z dg43tfdfdgfd