కాంగ్రెస్ ​అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది

కాంగ్రెస్ ​అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది

  • మైలార్ దేవ్ పల్లిలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ర్యాలీ

శంషాబాద్, వెలుగు : కాంగ్రెస్​పార్టీ అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తుందని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. కొన్ని పార్టీలు దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. శనివారం రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లిలో కాంగ్రెస్​డివిజన్ అధ్యక్షుడు ధనుంజయ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రంజిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికలు అయిపోగానే రూ.500కు గ్యాస్​సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఆగస్టు15లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నిబద్ధతతో  పనిచేస్తున్నారని, ఈసారి రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో కాంగ్రెస్​నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ధనుంజయ్, సానెమ్ శ్రీనివాస్ గౌడ్, సదాలక్ష్మి, ఇంద్రపాల్, సరికొండ వెంకటేశ్, మహమ్మద్ ఖాదర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాదిగ సంఘాల మహాకూటమి మద్దతు

చేవెళ్ల: బీజేపీకి ఏజెంటుగా మందకృష్ణ మాదిగను మాదిగలెవ్వరూ నమ్మొద్దని మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగ జాతిని తాకట్టు పెట్టిన మందకృష్ణను పల్లెల్లోకి రానియొద్దన్నారు. శనివారం చేవెళ్లలోని కాంగ్రెస్​ ఆఫీసులో మాదిగ సంఘాల మహా కూటమి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ సంగీతపు రాజలింగం మాదిగ అధ్యక్షతన ప్రెస్​మీట్​పెట్టారు.

ఈ సందర్భంగా కూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. చేవెళ్లలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మాదిగ సంఘాల మహా కూటమి 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కు అండగా నిలుస్తుందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T02:56:35Z dg43tfdfdgfd